News March 13, 2025
హోలీ పండుగ.. MHBD జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచన

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతగా జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున పలు సూచనలు చేశారు. చర్మానికి, పర్యావరణానికి హానికరం కానీ సహజ రంగులను ఉపయోగించాలన్నారు. మద్యపానం సేవించి వాహనాలను నడపద్దని ప్రజా స్థలాల్లో మర్యాదగా వ్యవహరించి ప్రశాంతమైన పండుగను జరుపుకోవాలని అన్నారు.
Similar News
News March 14, 2025
గోపాల మిత్రుల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సహాయం

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షుడు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఉన్నారు.
News March 14, 2025
హిందీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు మరో ఛాన్స్

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News March 14, 2025
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఈఓ ప్రొ. రాధాకిషన్ తెలిపారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్మీడియట్(ప్రాక్టికల్) పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుము చెల్లించిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని చెప్పారు.