News March 13, 2025
హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 14, 2025
కేంద్ర మంత్రిని కలిసిన ADB MP

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. NH44ను భోరజ్ నుంచి మహోర్ వరకు, గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్‌కు పొడింగించాలని విన్నవించారు. పెన్ గంగా&గోదావరి రోడ్డు మీద సేఫ్టీ పనులు త్వరలో పూర్తి చేయాలని కోరారు.
News March 14, 2025
HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 14, 2025
ఏలూరు : భార్యతో గొడవపడి భర్త సూసైడ్

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో గురువారం జరిగింది. పవర్ పేట పిల్లా వారి వీధికి చెందిన సుశీల్ (42) బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం లేచేసరికి ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారమందుకున్న టూటౌన్ సీఐ వైవీ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.