News November 5, 2024
₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!
Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్‌సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.
Similar News
News November 5, 2024
మిడ్ డే మీల్: ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ!
AP: మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా 4 రకాల మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండేలా <<14428656>>మెనూలను<<>> అధికారులు తయారుచేశారు. మరింత కసరత్తు అనంతరం కొత్త మెనూను డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
News November 5, 2024
రైతులకు గాడిద గుడ్డు అందింది: TG BJP
తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్న కాంగ్రెస్ ట్వీట్‌కు TGBJP కౌంటర్ ఇచ్చింది. ‘OCT 6న PM మోదీకి సీఎం రేవంత్ రాసిన లేఖలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఈ సంఖ్య 40 లక్షలకు చేరింది. వాస్తవమేంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. రూ.15వేలు రైతు భరోసాగా ఇస్తామని చెప్పి గాడిద గుడ్డు అందించింది’ అని పేర్కొంది.
News November 5, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్
డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.