News June 29, 2024

జియో, ఎయిర్‌టెల్ యూజర్లపై ₹47వేలకోట్ల భారం!

image

టారిఫ్ పెంపుతో జియో, ఎయిర్‌టెల్ యూజర్లపై ఏటా ₹47,500కోట్ల భారం పడనుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5జీ సేవలు కావాలనుకునే వారిపై ఈ భారం మరింత ఎక్కువ ఉండనుందని తెలిపారు. జియోలో ₹239 (1.5GB/డే)గా ఉన్న 5జీ మినిమమ్ రీఛార్జ్ అమౌంట్‌ను 46% పెంచి ₹349 (2GB/డే)కు చేర్చింది. ఎయిర్‌టెల్‌ ఏకంగా 71% పెంచింది. ₹239 (1.5GB/డే) ప్యాక్‌ను ₹409 (2.5GB/డే)కు పెంచింది.

Similar News

News September 21, 2024

జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి: CM చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.

News September 21, 2024

కారు యాక్సిడెంట్.. ICUలో నటుడు

image

బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలో ఈ ఉదయం అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్విన్ ‘మాన్సూన్ వెడ్డింగ్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’, ‘ది పర్ఫెక్ట్ హజ్బెండ్’ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి సినిమాల్లో నటించారు. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రీతి జింగ్యానీని పర్విన్ 2008లో పెళ్లి చేసుకున్నారు.

News September 21, 2024

చలించిన థరూర్: రోజుకు 8Hrs, వారానికి 5 రోజుల పనికి మద్దతు

image

రోజుకు 8Hrs, వారానికి 5 రోజుల పనివేళలకు MP శశి థరూర్ మద్దతిచ్చారు. దీంతోపాటు Govt, Pvt కంపెనీల్లో ఫిక్స్‌డ్ వర్క్ క్యాలెండర్‌కు చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. 4 నెలలు వీకాఫ్ లేకుండా రోజుకు 14Hrs పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయిన యంగ్ CA అన్నా సెబాస్టియన్ కుటుంబాన్ని పరామర్శించారు. ‘8Hrs మించి పనిచేయిస్తే శిక్షించేలా చట్టం తేవాలి. వర్క్‌ప్లేస్‌లో మానవ హక్కులు ఆగకూడద’ని అన్నారు.