News February 5, 2025
అంతర్వేదికి ప్రత్యేక బస్సులు
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7న స్వామివారి కళ్యాణం, 8న రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజులు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అమలాపురం డిపో మేనేజర్ సీహెచ్.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. అమలాపురం-అంతర్వేది, అప్పనపల్లి- అంతర్వేది, పల్లం-అంతర్వేది రూట్లో 46 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 6, 2025
25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు
AP: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి(ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటిదాకా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఈసారి సీఎం హాజరుకానున్నారు.
News February 6, 2025
పెద్దాపురం ఎంపీడీవోకు జిల్లా అధ్యక్ష పదవి
ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం కాకినాడ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీలలితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News February 6, 2025
ఇవాళ CLP సమావేశం.. కీలక అంశాలపై చర్చ
TG: కాంగ్రెస్ శాసనసభాపక్షం(CLP) ఇవాళ సమావేశం కానుంది. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో CM రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. MLC ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.