News October 23, 2024

అంబాజీపేట: కన్నీరు పెట్టిస్తున్న దంపతుల సూసైడ్ నోట్

image

అంబాజీపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం, నాగమణి దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ‘ఇంతవరకు మాకు చేసిన సేవలు చాలు, మీరైనా సుఖపడండి’అని లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కొడుకు వెంకటకిరణ్, కోడలు లక్ష్మీశ్వేత, మనవరాలు, మనవడు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరిని మనోవేదనకు గురిచేసింది. ప్రస్తుతం వీరి వద్ద చిన్న కుమార్తె సునీత తన బిడ్డతో ఉండగా.. ఆమె విశాఖలో ఓ వేడుకకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది.

Similar News

News December 6, 2025

8న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

image

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.