News January 4, 2026
9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్‌లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2026
దళారుల ఉచ్చులో పడకండి: DTO

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.