News March 29, 2025

అమలాపురం: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

image

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో సలీం భాష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

Similar News

News April 4, 2025

KMR: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

image

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.

News April 4, 2025

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల చివరి వారంలోగా రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీకి పూర్తి కానుంది. కాగా, 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్‌గా వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అటు ఏపీలో ఈ నెల 15లోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

News April 4, 2025

నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.

error: Content is protected !!