News April 4, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల చివరి వారంలోగా రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీకి పూర్తి కానుంది. కాగా, 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్‌గా వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అటు ఏపీలో ఈ నెల 15లోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
Similar News
News April 23, 2025
నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
News April 23, 2025
IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్‌గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్‌కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.
News April 23, 2025
త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ కీలక భేటీ

కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే త్రివిధ దళాధిపతులతో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. J&Kలో ప్రస్తుత పరిస్థితి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌పై NSA అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ AP సింగ్, నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠితో రాజ్‌నాథ్ చర్చించారు.