News December 13, 2024
ఇచ్ఛాపురం: మసీదులో హిందువులు ప్రత్యేక పూజలు

ఇచ్ఛాపురం పట్టణంలోని పీర్ల కొండపై గురువారం పీర్ల పండగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్ర-ఒడిశా నుంచి వందలాది మంది భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా నవంబర్‌లో నాలుగు గురువారాలు కొండపై పీర్ల పండుగ ఇక్కడ జరుగుతుంది. కొండపై ఉన్న మసీదుకు హిందువులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
Similar News
News October 15, 2025
‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం మారనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గుర్తించబోయే 20 వేల ఎకరాల భూమిలో, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాలతో పాటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతోంది.
News October 15, 2025
కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్‌ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News October 15, 2025
కళింగపట్నం బీచ్‌లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్‌లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.