News January 10, 2026

SKLM: వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ విజయ సారధి హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.