News April 3, 2025

ఇరిగేషన్ మంత్రి నిమ్మలతో బత్తుల భేటీ

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లులోని వారి క్యాంపు కార్యాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో వివిధ సమస్యలపై మంత్రితో చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రోయిన్లకి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

Similar News

News April 10, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

కొండగట్టులో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రేపటి నుంచి జరగబోయే చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, డిఎస్పి రవిచందర్, సీఐ నీలం రవి, తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

image

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌లో CM రేవంత్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.

error: Content is protected !!