News April 10, 2025

రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

image

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌లో CM రేవంత్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.

Similar News

News April 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా: CBN
* ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* TG: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి
* ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి
* BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్
* IPL: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం

News April 21, 2025

కొల్హాపూర్, కామాఖ్యలో ఆలయాలను దర్శించుకున్న సూర్య దంపతులు

image

తమిళ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మి, అస్సాంలోని కామాఖ్య ఆలయాల్లోని శక్తిపీఠాలను తాజాగా దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా.. సూర్య నటించిన రెట్రో వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 21, 2025

భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

image

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.

error: Content is protected !!