News March 16, 2025
ఈనెల 26న వికారాబాద్‌లో వాహనాల వేలం: ఎస్పీ

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వదిలేసిన, గుర్తుతెలియని 148 వాహనాలకు ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో దొరికిన వాహనాలను వికారాబాద్‌లో భద్రపరిచామని, పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం నిర్వహిస్తునట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 16, 2025
భువనగిరి: నాలుగు రోజుల్లో పరీక్ష.. అంతలోనే ప్రమాదం

భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టడంతో తల్లి మృతిచెందగా.. కూతురుకి గాయాలయ్యాయి. బాలిక పదోతరగతి చదువుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉండగా బాలికకు ప్రమాదం జరిగింది. ఆమెను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిది కొలనుపాక కాగా రాయగిరికి వలస వచ్చారు.
News March 16, 2025
ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్‌డేట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
News March 16, 2025
సీఎం రేవంత్ క్లాస్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అటెండెన్స్?

TG: నిన్న అసెంబ్లీలో CM రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైమ్ దాటిపోతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కదల్లేదు. రోజుకు 3సార్లు MLAల హాజరు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 3రోజుల క్రితం CLP మీటింగ్‌లో CM మాట్లాడుతున్న సమయంలో ఓ MLA నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం, సభలో BRS నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.