News March 16, 2025

ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్‌డేట్

image

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Similar News

News April 19, 2025

IPL: టాస్ గెలిచిన గుజరాత్

image

అహ్మదాబాద్‌లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్

News April 19, 2025

అప్పుడూ.. ఇప్పుడూ ఒకే స్కోరు, ఒకే రిజల్ట్

image

చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో మ్యాచులో RCB ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది.

News April 19, 2025

నేటి నుంచి 10 రోజులు..

image

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

error: Content is protected !!