News September 14, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

✒గణేష్ ఉత్సవాలు..పలుచోట్ల అన్నదానం
✒తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ అరుణ
✒వరద భాదితులకు జితేందర్ రెడ్డి రూ.కోటి విరాళం
✒28న జాతీయ లోక్ అదాలత్
✒కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు చెల్లించండి:AITUC
✒MBNR:ఇంటర్ అధికారిగా కౌసర్ జహన్
✒NRPT:నేలకొరిగిన వంద ఏళ్లనాటి వృక్షం
✒NGKL:అరుణాచలానికి ప్రత్యేక బస్సు
✒ప్రజాపాలన దినోత్సవ వేడుకలపై కలెక్టర్ల సమీక్ష
✒అరెస్టులు,నిర్బంధాలు BRSకు కొత్తేమీ కాదు:BRS
Similar News
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 12, 2025
రాజ్‌కోట్ నుంచి మహబూబ్‌నగర్‌కు పీయూ ఎన్ఎస్ఎస్ బృందం

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్‌ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
News November 12, 2025
MBNR: ‘సైబర్ కేసులను త్వరగా పరిష్కరించండి’

మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం ఆదేశించారు. జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం సైబర్ వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో కేసులు పరిష్కరించే ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


