News January 3, 2026

అభివృద్ధిలో MBNR జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పాలమూరును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్ సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పరస్పర సహకారంతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Similar News

News April 20, 2026

MBNR: మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహబూబ్‌నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ (DOST) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

News April 20, 2026

మహబూబ్‌నగర్: ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News April 20, 2026

MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.