News April 25, 2024
ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

✒ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. అమ్మాయిలదే హవా
✒కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
✒సమస్యల పరిష్కారానికి పోటీ చేస్తున్న: బర్రెలక్క
✒కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది:DK అరుణ
✒కారులో తిరిగేందుకు రాజకీయాల్లోకి రాలేదు:RS ప్రవీణ్
✒వేసవి సెలవులు.. పిల్లలపై కన్నేసి ఉంచండి: SPలు
✒GDWL: తనిఖీల్లో రూ.6,76,920 సీజ్
✒సర్వం సిద్ధం.. రేపటి నుంచి ఓపెన్ INTER,SSC పరీక్షలు
Similar News
News April 24, 2025
MBNR: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
News April 24, 2025
భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణపేట 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్నగర్లో 42 డిగ్రీలు నమోదైంది. మున్నుందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.