News March 17, 2025
ఎంపీ డీకే అరుణ నివాసంలో హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడి గంటన్నర పాటు ఇంట్లో పలు గదులలో తిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీకే అరుణ భద్రత కల్పించాలని కోరారు. అందులో భాగంగా హైదరాబాద్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిర సోమవారం ఎంపీ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆగంతకుడు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డీకే అరుణను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 18, 2025
NLG: సొరంగంలో కాలువల్లా పారుతున్న నీరు

ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గడం లేదు. సొరంగంలోని 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటుచేసిన డీ2 ప్రాంతంలో కాలువల పారుతుండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీటిని డివాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి 2.5 కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం ఎక్కడా తగ్గడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
News March 18, 2025
అన్నవరం: మూలవిరాట్ ఫోటో తీసిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ఈవో తనిఖీలు చేసినప్పుడు సత్రంలో బీర్ బాటిళ్లు దొరికాయి. కాగా 2023 సెప్టెంబర్లో ఓ యూట్యూబర్ మూలవిరాట్టు వీడియో తీసి అప్లోడ్ చేశాడు. వెంటనే తొలగించాలని ఆ వ్యక్తికి సూచించినా పట్టించుకోలేదు. దీంతో ఈవో వీర్ల సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 18, 2025
వరికుంటపాడు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్తో అనుచిత ప్రవర్తన

వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో BPM గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పోస్ట్ ఆఫీస్లో ఖాతాకు సంబంధించిన మొత్తంలో తేడా ఉందని అతడు అనుచితంగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.