News March 18, 2025

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

image

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.

Similar News

News April 24, 2025

సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

image

J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.

News April 24, 2025

సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

image

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.

News April 24, 2025

నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

image

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.

error: Content is protected !!