News December 27, 2024
ఎచ్చెర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Similar News
News February 5, 2025
శ్రీకాకుళం జిల్లా బెంతు ఒరియా అధ్యక్షుడిగా రజనీ కుమార్
బెంతు ఒరియాల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బల్లిపుట్టుగకు చెందిన రజనీ కుమార్ దొళాయిని నియమితులయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉన్న శ్యాంపురియా ఇటీవల మృతి చెందడంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా బెంతు ఒరియా కుల సంఘం అధ్యక్షుడిగా రజిని కుమార్ దోళాయి, ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ మజ్జి, తదితరులను ఎన్నుకున్నారు.
News February 5, 2025
1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
News February 5, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.