News November 21, 2024
ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.
Similar News
News October 19, 2025
ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యత: కేంద్రమంత్రి

గార మండలం శ్రీకూర్మం గ్రామంలో ఉన్న శ్రీకూర్మనాథుని ఆలయంతో పాటు కూర్మ గుండం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యేలు గొండు శంకర్, అతిధి గజపతిరాజుతో కలిసి కూర్మ గుండాన్ని పరిశీలించారు. శ్రీకూర్మంలో రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
News October 19, 2025
సిక్కోలులో శైవక్షేత్రాలు ఇవే..!

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానం, శ్రీముఖలింగం- ముఖలింగేశ్వరస్వామి, పలాస-స్వయంభూలింగేశ్వరస్వామి, పాతపట్నం-నీలకంటేశ్వరస్వామి, శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి కార్తీకమాస పూజలు చేయనున్నారు.
News October 19, 2025
ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

ఆముదాలవలస MLA కూన రవికుమార్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.