News August 30, 2024
కంచిలి: విష జ్వరానికి చిన్నారి బలి

కంచిలికి చెందిన ఆటో చోదకుడు లాబాల కామరాజు కుమార్తె ఝాన్సీ (7)కి ఈనెల 14న ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు కంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీ హెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి కన్ను మూసింది. మండల పరిధిలో విషజ్వరాల వ్యాప్తి పెరుగుతోంది.
Similar News
News November 13, 2025
సరుబుజ్జిలి: చెరువులో మహిళ మృతదేహం లభ్యం

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఏ.శకుంతల (48) అనే మహిళ బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతి చెందింది. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ B.హైమావతి ఘటప స్థలాని చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
ప్రభుత్వ చౌక ధరల డిపోలను తనిఖీ చేసిన రాష్ట్ర కమిషనర్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రోణంకి గోవిందరావు బుధవారం సోంపేటలో ఉన్న ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు సరుకులు ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా సరఫరా చేయాలని ఆదేశించారు. పంపిణీ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన, అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం బారువాలో ఉన్న డిపోలను పరిశీలించారు. పంపిణీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


