News February 10, 2025
గొండుపాలెం: డీసీసీబీ మాజీ డైరెక్టర్ మృతి

కే కోటపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు వెంకన్న పాత్రుడు స్వగ్రామం అయిన గొండుపాలెంలో ఆదివారం ఆకస్మికంగా మరణించారు. పలువురు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టర్‌గా ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేశారని పలువురు తెలిపారు.
Similar News
News March 20, 2025
6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
News March 20, 2025
చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
News March 20, 2025
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.