News February 10, 2025

గొండుపాలెం: డీసీసీబీ మాజీ డైరెక్టర్ మృతి

image

కే కోటపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు వెంకన్న పాత్రుడు స్వగ్రామం అయిన గొండుపాలెంలో ఆదివారం ఆకస్మికంగా మరణించారు. పలువురు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టర్‌గా ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేశారని పలువురు తెలిపారు.

Similar News

News April 14, 2026

మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ విడుదల

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News April 14, 2026

KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

image

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్‌కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.

News April 14, 2026

20 ఏళ్ల పాటు సీఎం.. నేటితో ముగిసిన శకం

image

బిహార్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు CMగా కొనసాగిన నితీశ్ <<19649099>>శకం<<>> నేటితో ముగిసింది.
*తొలిసారి 2000లో 7 రోజులు
*2005-10 వరకు 1,827 రోజులు
*2010-14 వరకు 1,270 రోజులు
*2015లో 270 రోజులు
*2015 నుంచి 2017 వరకు 614 రోజులు
*2017 జులై నుంచి 2020 వరకు 1,204 రోజులు
*2020 NOV నుంచి 2022 వరకు 631 రోజులు
*2022 AUG నుంచి 2024 వరకు 536 రోజులు
*2024 నుంచి 2025 వరకు 661 రోజులు
*2025 NOV నుంచి 2026 APR వరకు 146 రోజులు