News July 20, 2024
గోదావరి వరద తీవ్రత పై సీఎం ఆరా..!

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో వరద తీవ్రతపై CM రేవంత్ రెడ్డి జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద భారీగా వస్తున్న కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కాగా సెలవుల్లో కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 30, 2025
నేలకొండపల్లి: యువ రైతు ఆత్మహత్య

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో అప్పుల బాధ భరించలేక యువ కౌలు రైతు గడ్డి మందు తాగాడు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరు(27) 15 ఎకరాల కౌలు భూమి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో చేసిన రూ.20లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 29, 2025
ఖమ్మం: దీక్షా దివస్కు నేటితో 16 ఏళ్లు పూర్తి: సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన దీక్షకు నేటితో 16 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
News November 29, 2025
ఖమ్మం: NMMS పరీక్షా కీ.. అభ్యంతరాలు డిసెంబర్ 6లోపు సమర్పించండి: DEO

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) 8వ తరగతి పరీక్షా కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6వ తేదీలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని తెలిపారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కీని పరిశీలించి, అభ్యంతరాలను డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణకు నేరుగా సమర్పించాలని, గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించబోమని డీఈఓ స్పష్టం చేశారు.


