News January 8, 2026

సత్తుపల్లి జిల్లాపై మళ్ళీ చర్చ.. నెరవేరేనా ప్రియాంక గాంధీ హామీ?

image

సత్తుపల్లి జిల్లా హామీపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ‘నచ్చిన వారికి జిల్లాలు’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు పడతాయా? లేక రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సత్తుపల్లి ఆశలు మళ్లీ చిగురించాయి.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.