News March 9, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.
Similar News
News January 8, 2026
సత్తుపల్లి జిల్లాపై మళ్ళీ చర్చ.. నెరవేరేనా ప్రియాంక గాంధీ హామీ?

సత్తుపల్లి జిల్లా హామీపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ‘నచ్చిన వారికి జిల్లాలు’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు పడతాయా? లేక రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సత్తుపల్లి ఆశలు మళ్లీ చిగురించాయి.
News January 8, 2026
ఖమ్మం: పదో తరగతి విద్యార్థులకు ‘స్నాక్స్’.. నిధులు విడుదల!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్నాక్స్ ఖర్చుల నిమిత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 25.45 లక్షల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించనున్నారు.
News January 7, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా UPDATE..

యూరియా పంపిణీ పై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జిల్లాలో బుధవారం వరకు 10,345 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని వెల్లడించారు. అటు 100 ప్రైవేట్ షాపుల్లో 525.70 మెట్రిక్ టన్నులు, 83 పీఏసీఎస్ కేంద్రాల్లో 1169.10 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు 28,128 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు.


