News March 17, 2025
జగిత్యాల: ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం: ఎస్పీ

జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు లేఖలను ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.
News March 18, 2025
VKB: నిరీక్షణకు ఫలితం దక్కింది

దుద్యాలకి చెందిన మాసుల పద్మమ్మ, చిన్న సాయన్న కొడుకు మాసుల శశివర్ధన్ నిరీక్షణకు ఫలితం దక్కింది. 11 సంవత్సరాలుగా విద్యాశాఖలో సీఆర్పిగా విధులు నిర్వర్తిస్తూ చదివి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించాడు శశివర్ధన్. తల్లిదండ్రులు కలను నెరవేర్చాడు. అతణ్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.