News February 2, 2025
జనగామ: రేపటి ప్రజావాణి రద్దు
జనగామ కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.
Similar News
News February 3, 2025
MBNR: GET READY.. నేటి నుంచే ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 20 రోజులపాటు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. MBNR-8400, WNPT-4,101, NGKL-2680, NRPT-2360, GDWL-2,230 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 261 ఇంటర్మీడియట్ కళాశాలలో ఉండగా.. ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.
News February 3, 2025
నర్మల వాసికి జాతీయ నంది అవార్డు
గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ప్రముఖ కథ, నవల రచయిత గుండెల్లి నీలకంఠం జాతీయ నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవలు చేశారని ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
News February 3, 2025
15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్ చిత్రాన్ని ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపింది. 1993లో ఈ సినిమాను ఇండో-జపనీస్ టీమ్ తెరకెక్కించింది. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి రైటర్‌గా పనిచేశారు.