News February 12, 2025
జేఈఈలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323689057_727-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్ సెషన్-1లో అనంతపురం, సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అనంతపురానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి 99.99 పర్సంటైల్, గాండ్లపెంట మండలం సోమామాజులపల్లికి చెందిన ఓం కిరణ్ 99.91, అనంతపురం అశోక్ నగర్‌కు చెందిన అసిఫ్ 99.48, అనంతపురానికి చెందిన భావ, విశాల్ 99.43, 99.36 పర్సంటైల్‌తో సత్తా చాటారు.
Similar News
News February 12, 2025
రేపు గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355448835_81-normal-WIFI.webp)
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.
News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325851755_15795120-normal-WIFI.webp)
ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
News February 12, 2025
Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738644358848_1199-normal-WIFI.webp)
బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.