News February 12, 2025
Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.
Similar News
News March 18, 2025
టెన్త్ అర్హత.. CISFలో 1,161 ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ITI పాసైన 18-23 ఏళ్లలోపు వారు అర్హులు. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/
News March 18, 2025
Way2News Exclusive: టెన్త్ విద్యార్థులకు స్కామర్ల వల

AP: ఎలాగైనా టెన్త్ పాస్ కావాలనే విద్యార్థులను కొందరు దోచుకుంటున్నారు. డబ్బులిస్తే జరగబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లు పంపుతామని టెలిగ్రామ్ ఛానళ్లలో వల వేస్తున్నారు. దీంతో అమాయక స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తే ప్రొటెక్టెడ్ PDF పంపి, పాస్‌వర్డ్ కోసం మళ్లీ డబ్బు లాగుతున్నారు. ఇలాంటి స్కామర్లలో ఒకరితో స్టూడెంట్‌లా Way2News చాట్ చేసింది (పైన చాట్ ఫొటోలు). విద్యార్థులూ.. ఇలాంటి స్కామర్లను నమ్మకండి.
Share It
News March 18, 2025
రేపు GATE ఫలితాల విడుదల

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలలోపు రిజల్ట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.