News November 8, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*గోకవరం: షర్మిలను కలిసిన కాంగ్రెస్ నాయకులు
*కాకినాడ: దీపం-2 పథకంపై జేసీ సమీక్ష
*పి.గన్నవరం: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి
*తుని: మహిళ అదృశ్యంపై కేసు నమోదు
*పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ
*జగ్గంపేట: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన MLA నెహ్రూ
*గొల్లప్రోలు: బాలిక అదృశ్యంపై హోంమంత్రి ఆరా
*రాజమండ్రి: చంద్రబాబు ఫోటోకు మహిళలు పాలాభిషేకం
*రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

Similar News

News September 18, 2025

నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.