News March 26, 2025
ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Similar News
News April 3, 2025
PF విత్‌డ్రా మరింత సులభం: EPFO

EPFO నుంచి నగదు విత్‌డ్రా మరింత ఈజీ కానుంది. ఇకపై డబ్బు విత్‌డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదంది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. ఏడాదిగా కోటిన్నర మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో అందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
News April 3, 2025
సిరిసిల్ల: దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ధరణి దరఖాస్తులపై గురువారం వీసీ నిర్వహించారు. జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న 408 ధరణి దరఖాస్తులను వారం రోజుల్లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్డీవోలు రాదాబాయి, రాజేశ్వర్, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.
News April 3, 2025
కంబోడియాలో అనంతపురం యువకుడి ప్రతిభ

మార్చి 28, 29, 30న కంబోడియా దేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఆసియా పారా త్రో బాల్ జట్టులో అనంతపురం యువకుడు ప్రతిభ చాటారు. జిల్లాకు చెందిన వెన్నపూస రోషి రెడ్డి భారత త్రో బాల్ జట్టుకు ఎంపికై రజత పతకం సాధించినట్లు క్రీడా అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. భారత్ Vs మలేషియా పారా త్రోబాల్ జట్టు తలపడ్డాయని పేర్కొన్నారు. మొదటి 3 రౌండ్లలో భారత త్రోబాల్ జట్టు విజయం సాధించిందన్నారు.