News April 3, 2025

PF విత్‌డ్రా మరింత సులభం: EPFO

image

EPFO నుంచి నగదు విత్‌డ్రా మరింత ఈజీ కానుంది. ఇకపై డబ్బు విత్‌డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదంది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. ఏడాదిగా కోటిన్నర మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో అందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Similar News

News April 19, 2025

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

News April 19, 2025

రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేరుస్తాం: రాజ్‌నాథ్

image

రక్షణ రంగంలో భారత్‌ స్వయం ప్రతిపత్తి సాధించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. MHలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాట్లాడుతూ ‘మేం 2014లో అధికారం చేపట్టినప్పుడు రక్షణ ఎగుమతులు రూ.600 కోట్ల వరకే జరిగేవి. ప్రస్తుతం రూ.24వేల కోట్లకు చేరాయి. ఇక్కడితో సంతృప్తిపడం. 2029-30 వరకు ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!