News February 8, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ కీలక సూచన
వాలంటైన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు కీలక సూచన చేశారు. ఆఫర్స్ పేరుతో వచ్చే బహుమతులపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు వాలెంటైన్స్ డే కోసం బహుతులు అంటూ నకిలీ లింకులు పంపిస్తారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ సచివాలయంలో ఆంక్షలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమి ఖాయమైంది. దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ కూడా అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో తాజా ఆదేశాలు కీలకంగా మారాయి.
News February 8, 2025
NGKL: చెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడు మృతి
నాగర్ కర్నూల్ మండలంలోని నాగనూల్ గ్రామంలో చెట్టుపై నుంచి పడి గీతాచార్యుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(58) రోజు మాదిరిగానే ఈత చెట్టు ఎక్కి గీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందాడు.
News February 8, 2025
అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.