News February 8, 2025

ఢిల్లీ సచివాలయంలో ఆంక్షలు

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమి ఖాయమైంది. దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ కూడా అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో తాజా ఆదేశాలు కీలకంగా మారాయి.

Similar News

News April 16, 2026

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News April 16, 2026

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

image

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News April 16, 2026

వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

image

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.