News March 3, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 4, 2025

సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్: సీపీ

image

సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగు (43) కేంద్రాల వద్ద 163 BNSS 2023 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని (43) పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 500 మీటర్ల వరకు 163 BNSS 2023 అమల్లో ఉంటుదన్నారు.

News March 4, 2025

సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 4, 2025

రాష్ట్రస్థాయిలో ములుగుకు 89 మెడల్స్

image

ఏడో రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్ 2025 మేడారంలో నిర్వహించిన టోర్నమెంట్లో వెంకటాపురం మండలం విద్యార్థులు ప్రతిభ చాటారు. 89 మంది విద్యార్థులు పాల్గొంటే.. 56 గోల్డ్ మెడల్స్, 20 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. విద్యార్థులను సీఐ బండారి కుమార్, ఎస్సై తిరుపతిరావు అభినందించారు. కరాటే మాస్టర్ గొంది హనుమంతు, పశువుల సూర్యనారాయణ తదితరులున్నారు.

error: Content is protected !!