News February 14, 2026
పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు: VZM కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనంతరం చట్టబద్ధమైన గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వెంటనే దరఖాస్తులను పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News March 9, 2026
VZM: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 107 మందికి రూ.10.70 లక్షల ఫైన్

మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10.70 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు విజయనగరం జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
News March 9, 2026
VZM: ‘పనిచేసిన 15 రోజుల్లోపే ఖాతాలో వేతనం’

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్-రోజ్‌గార్, ఆజీవిక మిషన్ చట్టంపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 125 రోజుల ఉపాధి పని దినాల కల్పనకు పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామన్నారు. పని చేసిన 15 రోజుల్లోగా వేతనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
News March 9, 2026
VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


