News April 19, 2026
VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.
Similar News
News April 20, 2026
చెరువు వారీగా ప్రణాళిక వెంటనే పూర్తి కావాలి: VZM కలెక్టర్

జలధార- జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో చెరువు వారీగా ప్రణాళికలను రూపొందించి వెంటనే పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులకు మున్సిపల్ కమిషనర్, దేవస్థానాలకు సంబంధించిన పుష్కరిణి చెరువులకు కూడా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జలధార-జలహరతిపై పలు సూచనలు చేశారు.
News April 19, 2026
VZM: చందానోత్సవానికి వచ్చే వారికి ముఖ్య గమనిక

ఏప్రిల్ 20న సింహచలం చందనోత్సవానికి వస్తున్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. దేవస్థానం సుమారు 100 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి తీసుకెళ్లనుంది. అయితే అనకాపల్లి, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే వారు పాతగోశాల, శ్రీనివాస కళ్యాణ మండపం, సింహపురి కాలనీ వద్ద బస్సులు ఎక్కాలి. హనుమంతువాక నుంచి వచ్చే భక్తులు కొత్త గోశాల, అడవివరం కొత్త టోల్ గేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కాలి.
News April 18, 2026
VZM: ‘బీఎల్ఏలను త్వరగా నియమించాలి’

రాజకీయ పార్టీలు ప్రతీ పోలింగ్ కేంద్రానికి తమ ప్రతినిధులుగా బీఎల్ఏలను నియమించి, ఆ జాబితాను త్వరగా అందజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు కోరారు. తమ ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. బీఎల్ఎలను నియమించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అన్నారు.


