News March 20, 2025
పాడేరు: ‘నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం’

నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి నాటుసారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటుసారా నివారణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.
Similar News
News March 31, 2025
సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 31, 2025
భారీగా పెరిగిన చికెన్ ధరలు

రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ విక్రయాలు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ నిన్న కేజీపై రూ.50 నుంచి రూ.70 పెరగ్గా, ఇవాళ ఆ ధరలూ మరింత ఎక్కువ అవడం గమనార్హం.
News March 31, 2025
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఒకే మైదానంలో వన్డేలు, IPLలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్టార్క్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఫీట్ సాధించలేకపోయారు. SRHతో జరిగిన మ్యాచులో స్టార్క్ 5 వికెట్లు పడగొట్టారు. 2023లో ఇదే వేదికలో భారత్‌తో జరిగిన వన్డేలోనూ 5 వికెట్లు తీశారు. అలాగే DC తరఫున 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి విదేశీ ప్లేయర్‌గానూ ఆయన నిలిచారు.