News March 31, 2025

భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ విక్రయాలు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ నిన్న కేజీపై రూ.50 నుంచి రూ.70 పెరగ్గా, ఇవాళ ఆ ధరలూ మరింత ఎక్కువ అవడం గమనార్హం.

Similar News

News April 22, 2025

16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

image

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.

News April 22, 2025

ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

image

✒ 1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
✒ 1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం(ఫొటోలో)
✒ 1916: ప్రముఖ బెంగాళీ నటి కనన్ దేవి జననం
✒ 1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
✒ 1959: ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం
✒ 1994: US మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
✒ 2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం

News April 22, 2025

ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా

image

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా ఇకపై ప్రతినెలా ప్రకటించనుంది. మే15 నుంచి దీనికి శ్రీకారం చుట్టనుంది. అలాగే రూరల్ డేటాను 3 నెలలకోసారి(గతంలో ఏడాదికోసారి) వెలువరించనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి నెలా నిరుద్యోగ డేటా వెలువడుతుంది. దీనివల్ల నిరుద్యోగితను తగ్గించేందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.

error: Content is protected !!