News March 10, 2025
పార్వతీపురం: ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మార్చి 17వ తేదీ నుంచి నిర్వహించు ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు, మార్చి 2025కు సంబంధించిన అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ నుంచి పొందవచ్చని DEO డా. యన్. తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హాల్ టికెట్లను వాట్సాప్-మన మిత్ర లేదా అధికారిక వెబ్ సైట్ apopenschool.ap.gov.in నందు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 11, 2025
PPM: జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన

జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. హేమలత అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని, బస వేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు అవుతారని ఆమె తెలిపారు.
News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
News March 11, 2025
మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.