News March 10, 2025
పిఠాపురం: ఎమ్మెల్సీ రాకపోవడంతో వర్మ అసహనం?

ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరులు దగ్గర వాపోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంతకుమించి తాను ఇక ఏమీ మాట్లాడలేనని అమరావతి నుంచి కారులో పిఠాపురం బయలుదేరారు.
Similar News
News March 10, 2025
PPM: అందరి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి చేద్దాం

జిల్లాలో అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో నడిపిద్దామని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీ-4, నియోజకవర్గ విజన్‌పై జిల్లా అధికారులు, స్వచ్ఛంధ సంస్థలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్ కింద పీ-4 విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు.
News March 10, 2025
ఖమ్మం: ‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 36 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ కలిగే అవకాశం ఉందని, మ.12 నుంచి మ.3:30 వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని తెలిపారు. మధ్యాహ్నం వరకే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. బయటికి వెళ్లేవారు నీరు, గొడుగును తీసుకువెళ్లాలని, సాయంత్రం, ఉదయం వేళల్లో బయటికి వెళ్లాలని సూచించారు.
News March 10, 2025
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.