News March 10, 2025
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 26, 2025
బెడ్‌రూమ్‌లో ఏ కలర్ లైట్ మంచిది?

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్‌రూమ్‌లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
News March 26, 2025
ఇఫ్తార్ విందుకు ఈసీ నో

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించదలచిన ఇఫ్తార్ విందుకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొంటారని పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాయగా ఈసీ తిరస్కరించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.
News March 26, 2025
బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీలో కీలక పదవి

AP: శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.