News September 15, 2024

పోలాకి: జీడి తోటలో 12 అడుగుల కొండచిలువ హల్‌చల్

image

నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం గ్రామంలో ఆదివారం ఉదయం కొండ చిలువ కలకలం రేపింది. మబగాం గ్రామానికి చెందిన రైతు ఆసిరినాయుడు ఉదయాన్నే జీడి తోటకు వెళ్లాడు. పొలంలో సంచరిస్తున్న12 అడుగుల కొండచిలువ రైతుపై దాడి చేసింది. చాకచక్యంగా కట్టెతో కొట్టి చంపాడు.

Similar News

News November 27, 2025

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025

టెక్కలి: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.