News February 9, 2025
భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739033927081_1280-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.
Similar News
News February 10, 2025
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు: అంబటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739192425389_1032-normal-WIFI.webp)
AP: రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కూడా వంత పాడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు వచ్చాకే AR సప్లైస్ నెయ్యి సరఫరా చేసింది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది? లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని పచ్చి అబద్ధం ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News February 10, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738029385955_893-normal-WIFI.webp)
తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.
News February 10, 2025
ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘనపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739188126662_51768855-normal-WIFI.webp)
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలను రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.