News February 10, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.
Similar News
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.
News February 7, 2026
రికార్డులన్నీ డిజిటలైజ్ చేయాలి: జేసీ అభిషేక్ గౌడ

ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయ రికార్డులను తక్షణమే డిజిటలైజ్ చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు కేసులు, వివిధ మంజూరు పత్రాలను ‘గూగుల్ ఏజెంట్ స్పేస్’లో అప్‌లోడ్ చేయాలన్నారు. పాలనలో జవాబుదారీతనం, రికార్డుల భద్రత కోసం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: జేడీ

జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్‌కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.


