News September 3, 2024

భారీ వర్షాలు.. 10 పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 30,950 ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. అందులో 20 వేల ఇళ్లను పాక్షికంగా నేల మట్టం చేశారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 10 ఇళ్లు పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 11 వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి మొత్తం 2.14 లక్షల దరఖాస్తులొచ్చాయి.

Similar News

News January 3, 2026

అభివృద్ధిలో MBNR జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పాలమూరును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్ సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పరస్పర సహకారంతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News January 2, 2026

MBNR: TG TET.. బందోబస్తు ఏర్పాటు: SP

image

MBNR జిల్లాలో TG TET దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి.జానకి తెలిపారు. పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 2, 2026

మహబూబ్‌నగర్: నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడుటకు, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ దృష్ట్యా ఇవాళ ఉదయం నుంచి జనవరి 31 సాయంత్రం 6 గంటల వరకు భారత పోలీస్ చట్టంలోని 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఐదుగురికి మించి గుంపులుగా కూడరాదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, ఇతర ప్రమాదకర వస్తువులతో తిరగరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించరాదన్నారు.
SHARE IT