News February 9, 2025

భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

భువనగిరి మండలం మన్నెవారిపంపుకు చెందిన గుండ్ల ఎల్లారెడ్డి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో గాయాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రుడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా వృద్ధుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల అంగీకారంతో మృతుడి కళ్లను దానం చేశారు.

Similar News

News February 10, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.

News February 10, 2025

ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘనపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలను రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

News February 10, 2025

రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP

image

TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.

error: Content is protected !!